విజయవాడ సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వరద నష్టంపై ప్రాథమిక అంచనాలు అందాయని, పొలాల్లో నీరు తగ్గిగ వెంటనే పంట నష్టంపై వివరాలు నమోదు చేయిస్తామన్నారు. గతంలో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించే వారని, ఇప్పుడు నూరు శాతం సబ్సిడీపై ఇస్తామని చెప్పారు.
'రైతులకు నూరు శాతం విత్తనాలు ఉచితంగా ఇస్తాం'
రాష్ట్రంలో వరదలు, కరవు ఇబ్బంది పెడుతున్నా... రైతులకు అవసరమైన అన్ని రకాలసాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
'రైతులకు నూరు శాతం విత్తనాలు ఉచితంగా ఇస్తాం'