కృష్ణా జిల్లాలో ప్రమాదం, ముగ్గురు మృతి - lorry overturned in gannavaram news
07:27 July 07
road accident in krishna
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరవల్లి కూడలి వద్ద లారీ బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బియ్యం లోడుతో బిహార్ నుంచి బెంగుళూరు వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. లారీ పైభాగాన కూర్చున్న ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాసరావు(29), రాజ్యలక్ష్మీ(25) , రోహిత్(2) మృతిచెందారు. వారిని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం వాసులుగా గుర్తించారు. లారీని క్లీనర్ నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు హైవే పెట్రోలింగ్ సిబ్బంది క్రేన్ సాయంతో లారీని బయటకు తీస్తున్నారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
ఇదీ చదవండి:కూలింది వారధి.. గ్రామస్థులకు దారేదీ?