పడమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా ఆకస్మిక తనిఖీలు - patamata sub registar
డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారన్న సమాచారంతో విజయవాడ పడమట సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న వారిని గుర్తించారు. 3 లక్షలకు పైగా నగదను స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ పడమట సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనిశా అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, ఇతర సిబ్బంది సాయంత్రం నాలుగు గంటల తర్వాత సోదాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా 12 మంది డాక్యుమెంట్ రైటర్లను కార్యాలయం లోపలికి సబ్ రిజిస్ట్రార్ అనుమతించినట్లు అనిశా తనిఖీల్లో గుర్తించారు. వీరి నుంచి 3 లక్షల 41 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనధికార వ్యక్తులతో కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేయిస్తున్నట్లు కనుగొన్నారు.