సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి - nuziveedu
భూమి ధరలకు రెక్కలు రావటంతో అధికారులు సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఏసీబీ అధికారులు ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి చేశారు.
ఏసీబీ దాడి
కృష్ణా జిల్లా నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. భూముల కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని తెలియడంతో అక్కడకు వచ్చారు.అవినీతి నిరోధక శాఖ ఏఎస్పీ సాయి కృష్ణ ఆధ్వర్యంలో అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. కార్యాలయంలోని డాక్యుమెంట్ రైటర్ల వద్ద లెక్కల్లో చూపని లక్షా పదివేల రూపాయల నగదు లభించినట్లు ఏఎస్పీ సాయి కృష్ణ తెలిపారు. విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.