కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనీఖీలు చేపట్టారు. హాస్టల్లో పిల్లలకు పెట్టవలసిన గుడ్లు, పాలు అన్నీ సమపాళ్లలో ఇవ్వకపోవడం...వంట సరుకుల నిర్వహణలో లోపాలు వంటివి అధికారులు గుర్తించారు. ఇంకా అన్నింటిని నిశితంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సాయి కృష్ణ తెలిపారు.
ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ సోదాలు - sc girls hostel
కృష్ణాజిల్లా కైకలూరులోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పిల్లలకు పెట్టవలసిన ఆహారం, వంట సరుకుల నిర్వహణలో లోపాలున్నాయని అధికారులు గుర్తించారు. అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు.
ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ అధికారులు సోదాలు