విజయవాడ దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మ దర్శనానికి బెజవాడ చేరుకుంటున్నారు. మహామంటపంలోని 6వ అంతస్తు... సారె సమర్పించేందుకు వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, పిండివంటలను.. భక్తులు తమ శక్తి కొద్ది సమర్పిస్తున్నారు. సారెగా తీసుకొచ్చిన పిండివంటలు అమ్మవారికి నివేదించిన తర్వాత... ఆలయానికి వచ్చే భక్తులకు వాటిని ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ వరకు అమ్మవారికి ఆషాడ సారె కార్యక్రమం జరగనుంది.
దుర్గమ్మా.. సారె అందుకుని దీవించమ్మా - temple
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించేందుకు... భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వచ్చే నెల 1 వరకు వేడుక జరగనుంది.
ఆషాడ సారె