ఆషాఢ పవిత్రోత్సవాలతో కృష్ణా జిల్లా మోపిదేవిలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం.. ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉత్సవాల్లో భాగంగా... స్వామి, అమ్మవార్లకు శుద్ధజలాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అధికారి లీలా కుమార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
మోపిదేవిలో వైభవంగా ఆషాఢ పవిత్రోత్సవాలు - devotees
కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువైన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో... ఆషాఢ పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఆషాడ పవిత్రోత్సవాలు