సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఆరు నెలల నుంచి ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పారితోషికాలతో ముడిపెట్టకుండా పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. రాజకీయ నాయకులు కొందరు తమకు అనుకూలమైన వారిని నియమించుకుంటున్నారని ఆరోపించారు. అక్రమ తరలింపులు, రాజకీయ వేధింపులను అరికట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలనీ.. లేదంటే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళన - ఆశా వర్కర్ల
"మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆరునెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలి. రాజకీయ వేధింపులు, అక్రమ తరలింపులు అరికట్టాలి. లేదంటే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తాం." ఆశా వర్కర్లు
రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళన