అప్పులు చెల్లించలేక... యువకుడు సెల్ఫీ సూసైడ్ - haraasment
తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక, డబ్బు ఇచ్చిన వారి వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకుని తనకు మృతికి కారణం ఎవరో వెల్లడించాడు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భానుప్రకాష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్డీలు కట్టలేక ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు చనిపోయే ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. తన చావుకు అఖిల్ అనే వ్యక్తి, అతని తండ్రి కారణమని వీడియోలో పేర్కొన్నాడు. తీసుకున్న అప్పుకి వడ్డీ పెంచి తన బైక్ను తీసుకెళ్లారని వివరించాడు. ఈ చర్యలతో తాను మనస్థాపం చెందినట్టు భాను ప్రకాష్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అంత్యక్రియల అనంతరం స్నేహితులు అతని మొబైల్ చెక్ చేయగా ఈ సెల్ఫీ సూసైడ్ వీడియో బయటపడిందని పోలీసులు తెలిపారు.