కృష్ణా జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాతంగి వెంకటేశ్వర్రావు పాము కాటుకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆయన ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని వైద్యులు తెలిపారు. రైతులు వర్షాకాలంలో వ్యవసాయ పనులకు వెళ్లేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత నెలలో ఇదే ప్రాంతంలో పాము కాటుకు గురైన వారు పదుల సంఖ్యలో ఉన్నారు.
రెడ్డిగూడెంలో వ్యక్తికి పాముకాటు..ఆందోళనలో ప్రజలు - snake attack cases in nuzivid govt hospital
నూజివీడు వాసులు పాములతో ఆందోళనకు గురవుతున్నారు. గత నెలలో పాము కాటుతో పదుల సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా.. తాజాగా రెడ్డిగూడెంకు చెందిన వెంకటేశ్వర్రావు పొలం పనులు చేసి తిరిగి వస్తుండగా పాము కాటుతో అస్వస్థతకు గురయ్యాడు.
పాముకాటుతో వ్యక్తికి అస్వస్థత