ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం - SUCIDE
కృష్ణా జిల్లా గన్నవరం బీసీ వసతి గృహంలో 5వ తరగతి చదువుతున్న ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. బాలుడిని వెంటనే సమీపంలోని చిన్నఅవుటపల్లి పిన్నమనేని సిద్దార్ధ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రవీణ్ స్వస్ధలం ఆగిరపల్లి మండలం రాజువారి గొల్లగూడెం. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
5వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
.
Last Updated : Jul 1, 2019, 12:41 PM IST