మచిలీపట్నంలో ప్రచారం చేస్తున్న తెదేపా, వైకాపా మచిలీపట్టణం నియోజకవర్గంతెదేపా అభ్యర్థి, మంత్రి కొల్లు రవీంద్ర ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటిస్తూ... ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలువివరిస్తున్నారు. భారీ మోజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.పెడన శాసనసభ వైకాపా అభ్యర్థి జోగి రమేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పర్యటిస్తూ...పార్టీ నవరత్నాలను వివరించారు. ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలను ఎండగట్టారు. ఆయనతోపాటు మచిలీపట్టణం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి వల్లభనేని బాలశౌరీ పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. ఇవీ చూడండి.