కృష్ణా జిల్లా నూజివీడులోని నెహ్రూ పేటలో ఉన్న సీఎస్ఐ పాఠశాలలో కొన్నేళ్లుగా ముగ్గురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులతో విద్యాబోధన సాగిస్తున్నారు. ఇదేమని ప్రధానోపాధ్యాయులు అడగగా పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారని.. అందులో ఆరుగురు మధ్యాహ్న భోజనం తీసుకోరని.. ముగ్గురు మాత్రం ఉన్నారని దాటవేశారు. వాస్తవానికి మాత్రం ఒకటో తరగతిలో ఇద్దరు, ఏడో తరగతిలో ఒకరు మాత్రమే చదువుతున్నామంటూ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 20 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఉండాలని చెప్తుంటే.. ఇక్కడ మాత్రం ముగ్గురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
ముగ్గురు విద్యార్థులు... ఇద్దరు టీచర్లు! - nuziveedu
కృష్ణా జిల్లా నూజివీడులో సీఎస్ఐ పాఠశాలలో కేవలం ముగ్గురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు.
పాఠశాల