పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల బరిలో మొత్తం 1,825 మంది తలపడుతున్నారు. జిల్లాలోని 46 జడ్పీటీసీ స్థానాలు, 723 ఎంపీటీసీ స్థానాలకు నాలుగు వేల మందికి పైగా నామపత్రాలు సమర్పించారు. పరిశీలన, ఉపసంహరణల అనంతరం జడ్పీటీసీ స్థానాల్లో 176 మంది, ఎంపీటీసీ స్థానాలో 1,649 మంది బరిలో నిలిచారు. 46 జడ్పీటీసీ స్థానాల్లో మండవల్లి, ఉంగుటూరు స్థానాలతో పాటు జిల్లా మొత్తం మీద 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మండవల్లి, విజయవాడ రూరల్ మండలాల్లో అత్యధిక సంఖ్యలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాల చొప్పున ఏకగ్రీవం అయ్యాయి.
పరిషత్ బరిలో 1,825 మంది - krishna
కృష్ణా జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల బరిలో మొత్తం 1,825 మంది తలపడుతున్నారు. జడ్పీటీసీ స్థానాల్లో 176 మంది, ఎంపీటీసీ స్థానాలో 1,649 మంది బరిలో నిలిచారు. 46 జడ్పీటీసీ స్థానాల్లో మండవల్లి, ఉంగుటూరు స్థానాలతో పాటు జిల్లా మొత్తం మీద 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామపత్రాల ఉపసంహరణ ముగియడంతో బరిలో అభ్యర్థుల జాబితా లెక్క తేలింది. జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఉంగుటూరు మండలంలో వైకాపా అభ్యర్థి దుత్తా సీతారామలక్ష్మి, మండవల్లిలో వైకాపా అభ్యర్థి ఎం.విజయనిర్మల మినహా ఆయా స్థానాల్లో మిగిలిన అభ్యర్థులు తమ నామపత్రాలను ఉపంసంహరించుకోవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి శనివారం జిల్లా వ్యాప్తంగా 1,653 మంది తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా మొత్తం 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిల్లో మండవల్లి, ముదినేపల్లి, విజయవాడ రూరల్ మండలాల్లో ఎనిమిది మంది చొప్పన ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. మండలాల వారీగా బాపులపాడులో 3, గన్నవరంలో 1, గూడూరు 1, గుడివాడ 1, ఇబ్రహీంపట్నం 6, కలిదిండి 1, కంకిపాడు 1, కృత్తివెన్ను 1, మొవ్వ 1, నాగాయలంక, 5, నందిగామ 2, నందివాడ 4, పామర్రు 3, పెడన 1, పెదపారుపూడి 1, పెనుగంచిప్రోలు 2, రెడ్డిగూడెం 1, తిరువూరు 1, ఉంగుటూరు 6, వత్సవాయి 2, ఉయ్యూరు 1, విజయవాడ రూరల్ 8 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మండవల్లిలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 8 మంది వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో ఎంపీపీ స్థానం సైతం ఆ పార్టీనే చేజిక్కించుకుంది. ముదినేపల్లిలో 18 ఎంటీటీసీ స్థానాలు ఉండగా ఎనిమిది స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.
ఇదీ చదవండి : మెజార్టీ స్థానాల్లో అధికార పార్టీ పాగా!
TAGGED:
krishna