కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 12 ట్రాక్టర్లను నందిగామ పోలీసులు సీజ్ చేశారు. కంచికచర్ల నుంచి విజయవాడ వైపు ఇసుక తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేశారు. ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు నందిగామ గ్రామీణ సీఐ సతీష్ తెలిపారు.
ఇసుక అక్రమ రవాణా.. 12 ట్రాక్టర్లు సీజ్ - krishna district
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 12 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.
ఇసుక అక్రమరవాణా చేస్తున్న 12 ట్రాక్టర్లు సీజ్