పట్టాభిరాం నివాసంపై జరిగిన దాడి ఘటనలో 11 మందిని అరెస్టు చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో విజయవాడ గుణదల, క్రీస్తురాజపురం, బావాజీపేట, ఉడ్‌పేట, సీతారామపురం వాసులున్నారు. ఈనెల 19వ తేదీ సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులు, ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేసినట్లు పట్టాభి భార్య చందన పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 148, 427, 452, 506, 149 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ARREST: పట్టాభి నివాసంపై దాడి కేసులో 11 మంది అరెస్టు
13:45 October 23
సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించాం: పోలీసులు
దర్యాప్తులో భాగంగా పటమట పోలీసులకు అందిన సమాచారం ప్రకారం 11 మంది నిందితులను అరెస్టు చేసి వారికి నోటీసులు ఇచ్చామన్నారు. నిందితుల్లో బావాజీపేటకు చెందిన బచ్చు మాధవికృష్ణ, ఉడ్‌పేటకు చెందిన ఇందుపల్లి సుభాషిణి, గుణదలకు చెందిన తుంగం ఝాన్సీరాణి, బేతాల సునీత, క్రీస్తురాజపురానికి చెందిన యల్లాటి కార్తీక్, గొల్ల ప్రభుకుమార్, వినుకొండ అవినాష్, వంకాయలపాటి రాజ్‌కుమార్, బచ్చలకూరి అశోక్‌కుమార్, సీతారామపురానికి చెందిన గూడవల్లి భారతి, దండు నాగమణి ఉన్నట్లు తెలిపారు. విచారణలో భాగంగా సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలు, నేరం జరిగిన ప్రదేశానికి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పటివరకు 11 మంది నిందితులను గుర్తించామని పేర్కొన్నారు.
TDP DELHI TOUR: సోమవారం రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు బృందం