రాష్ట్రవ్యాప్తంగా 108 వాహన సిబ్బంది సమ్మెకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వాసుపత్రి వద్ద 108 వాహన సిబ్బంది ఆందోళన చేపట్టారు. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరానికి చెందిన 108 వాహన సిబ్బంది పాల్గొన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 108 వాహనాల్లో సరైన సౌకర్యాలు కల్పించడం లేదనీ.. ఒక్కొక్క ఉద్యోగికి రూ.70,000 వరకూ బకాయిలు చెల్లించాలని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 108 వాహన సిబ్బంది సమ్మె
తమ సమస్యలు పరిష్కరించాలని.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ.. 108 వాహన సిబ్బంది ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: 108 వాహన సిబ్బంది