ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోర్బ్స్‌ జాబితాలో కోనసీమ యువకుడు - Telugu boy in Forbes list

కోనసీమకు చెందిన యువకుడు ఈసీఈ మేజరు డిగ్రీగా, సీఎస్‌ఈ మైనర్‌ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేసి.. ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకున్నారు. మెడికల్‌ ఇమేజింగ్‌లో ఏడేళ్లపైబడి అనుభవం ఉన్న యువకుడు ఇప్పటి వరకు 25 పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన చేశారు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఇతను చేస్తున్న పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్‌ పత్రిక యువ సాధకుల జాబితాలో చోటు కల్పించింది.

young man from  Konaseema District on  forbes list
young man from Konaseema District on forbes list

By

Published : Feb 6, 2023, 12:28 PM IST

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామకు చెందిన కాకిలేటి సూరిబాబు కుమారుడు శివతేజ ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన టాప్‌ 30 యువ సాధకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఐఐటీ గువాహటిలో ఈసీఈ మేజరు డిగ్రీగా, సీఎస్‌ఈ మైనర్‌ డిగ్రీగా ఏకకాలంలో ఆయన పూర్తి చేశారు. ప్రస్తుతం బెంగళూరులో నిరామయ్‌ అనే వైద్య సంబంధిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీని కొంతమంది భాగస్వామ్యంతో ప్రారంభించి రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నారు.

ఇందులో శివతేజ మెషీన్‌ లెర్నింగ్‌ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ పరిశోధనలు చేస్తూనే నెదర్లాండ్స్‌లోని మాస్ట్రక్ట్‌ యూనివర్సిటీలో క్లినికల్‌ డేటా సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. మెడికల్‌ ఇమేజింగ్‌లో ఏడేళ్లపైబడి అనుభవం ఉన్న శివతేజ ఇప్పటి వరకు 25 పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన చేశారు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఈయన చేస్తున్న పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్‌ పత్రిక యువ సాధకుల జాబితాలో చోటు కల్పించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details