ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 16, 2023, 1:00 PM IST

ETV Bharat / state

టీడీపీ నేత ఇంటిపై వైసీపీ నేతలు దాడి.. మహిళలను సైతం లెక్కచేయకుండా!

Dr. BR Ambedkar Konaseema District: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల దౌర్జ్యనాలకు అంతు లేకుండా పోతుంది. గ్రామాల్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారంగా.. ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. తమ పనులకు అడ్డొచ్చిన వారిని.. అడ్డం లేకుండా చేసేందుకు ఎంతటికైనా వెనకడటం లేదు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మాజీ ఉపసర్పంచ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి ఆయన చిన్న కుమారుడిని గాయపరిచారు.

Konaseema
Konaseema

టీడీపీ నేత ఇంటిపై వైసీపీ నేతలు దాడి.. మహిళలను సైతం లెక్కచేయకుండా!

Dr. BR Ambedkar Konaseema District: రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల దాడులు ఎక్కువయ్యాయి. ఎవరైనా ఎదురు తిరిగినా.. మాట వినక పోయినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా వెంటనే దాడులు చేస్తున్నారు. పెద్దాచిన్నా అనే తేడా లేకుండా విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నారు. అడ్డుకున్న వారిపై రాళ్లు విసరడం, దుర్భాషాలడటం వంటివి చేస్తున్నారు. ఏదైనా జరిగితే అధికార పార్టీ నాయకులే తమకు అండగా ఉంటారులే వాళ్లు చూసుకుంటారులే అనే ధైర్యంతో విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అధికారి పార్టీకి చెందిన వారి దాడులే ఎక్కువవుతున్నాయి. వైసీపీ దాడులపై పోలీసులను ఆశ్రయించలేని వారు.. వారిని ఎదురించలేక ఆత్మహత్యలకు చేసుకుంటున్నారు. ఓ పక్క ఫిర్యాదులు స్వీకరిస్తున్న పోలీసులు.. అధికార పార్టీలకు కొమ్ముకాస్తూ కేసును పక్క దారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంక మాజీ ఉపసర్పంచ్, తెలుగుదేశం నేత గుర్రాల నాగభూషణం ఇంటిపై గత రాత్రి వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా దాడి చేసి ఆయన చిన్న కుమారుడిని గాయపరిచారు.

ఆ గ్రామ సర్పంచ్ వైసీపీ నేత కర్రీ గోవింద కృష్ణారెడ్డి 8 నెలల క్రితం ఆ గ్రామంలో లంక ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరిపి విక్రయించాడు. మట్టి తవ్వకాలు జరపడం వల్ల రైతుల ఇబ్బందులు పడుతున్నారని, తవ్వకాలు నిలిపివేయాలని కోరినా ఆపలేదన్నారు. దీంతో మాజీ ఉప సర్పంచ్ పెద్ద కుమారుడు సత్యనారాయణ హైకోర్టు నుంచి స్టే తీసుకురావడంతో తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. అప్పటినుంచి కోపంతో ఆయన అనుచరులు తమను బెదిరిస్తున్నారని, హైకోర్టులో స్టే తీసివేయాలని ఇంటికి వచ్చి దాడి చేశారన్నారు. ఈ దాడిలో ఆయన చిన్న కుమారుడు పులేశ్వరరావుకు గాయాలయ్యాయి. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు ఆకులు రామకృష్ణ, చిలుకూరి సతీష్ రాజు, గుత్తుల రాంబాబు, ఆనందరావు తదితరులు సంఘీభావం తెలిపారు దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కొమరాజులంకలో మాకు భూమి ఉంది అక్కడ కొంతమంది వైసీపీ నాయకులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని మా అన్నయ్య హైకోర్టులో స్టే వేశాడు.. అప్పటి నుంచి కొమరాజులంక సర్పంచ్​ గోవింద కృష్ణారెడ్డి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. అతను తన అనుచరులను తీసుకు వచ్చి మా మీద దాడి చేశారు.- పులేశ్వరరావు, బాధితుడు

నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో కొమరాజులంకలో తెలుగు దేశం పార్టీలో క్రియాశీలక నేత గుర్రాల నాగ భుషణం ఇంటికి వైసీపీ నేతలు వచ్చి వారి కుటుంబం మీద దాడి చేశారు. ఈ దాడిని తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ నాయకులు ముఖ్యంగా చేస్తున్న పని కులాల మధ్య చిచ్చులు పెట్టి లబ్ధిపొందడానికి చూస్తున్నారు.- ఆకులు రామకృష్ణ, తెలుగుదేశం నాయకులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details