CM TOUR: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్లలో "వైఎస్సార్ మత్య్సకార భరోసా" నిధులు విడుదల చేయనున్నారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు ఐ.పోలవరం మండలం కొమరగిరి చేరుకుంటారు. 10.45 గంటలకు మురమళ్ల వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం తర్వాత...మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు తాడేపల్లికి తిరిగి బయల్దేరనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో...మురమళ్ళలో ఏర్పాట్లను ముమ్మడివరం ఎమ్మెల్యే వెంకట సతీష్ పరిశీలించారు.
CM TOUR: నేడు కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన.. - కోనసీమ జిల్లా తాాజా వార్తలు
CM TOUR: నేడు కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. మురమళ్లలో వైఎస్సార్ మత్య్సకార భరోసా నిధులను ఆయన విడుదల చేయనున్నారు.
రేపు కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన..
Last Updated : May 13, 2022, 4:15 AM IST