Pensions Cancelled In AP: పేద కుటుంబానికి చెందిన తనకు ప్రభుత్వం సామాజిక పింఛను రద్దుచేసి ఏడాది కావస్తున్నా నేటికీ పునరుద్ధరించలేదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పిల్లి సుబ్బలక్ష్మి అనే వితంతువు మంత్రి విశ్వరూప్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. అమలాపురంలో నూతనంగా మంజూరైన వారికి సామాజిక పింఛన్లు మంత్రి విశ్వరూప చేతుల మీదుగా పంపిణీ చేశారు.
పింఛను రద్దు చేసి ఏడాది అయ్యింది.. ఇంకా పునరుద్ధరించలేదు - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
Pensions Cancelled In AP: పేద కుటుంబానికి చెందిన తనకు ప్రభుత్వం సామాజిక పింఛను రద్దుచేసి ఏడాది కావస్తున్నా నేటికీ పునరుద్ధరించలేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పిల్లి సుబ్బలక్ష్మి అనే వితంతువు మంత్రి విశ్వరూప్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. వీరి సమస్యలను పరిష్కరించాలని మంత్రి విశ్వరూప్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
భర్త చనిపోగా.. తనకు పింఛను వచ్చేదని.. తన పేరు, కుమార్తె పేరు ఒకే రేషన్ కార్డులో ఉండడంతో పింఛను రద్దు చేశారని ఓ వృద్ధురాలు వాపోయింది. కుమార్తె భర్త కూడా చనిపోయాడని.. ఒకే రేషన్ కార్డుపై రెండు పెన్షన్లు ఇవ్వడం కుదరదని.. తన పింఛను రద్దుచేసి మంజూరు చేశారన్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని ఆమె కన్నీటిపర్యంతమైంది. తన గోడును మంత్రి పినిపే విశ్వరూపు ఎదుట చెప్పుకొని కన్నీరుమున్నీరయింది. ఇలా మరికొంతమంది వృద్ధులు వితంతువులు కూడా తమ పింఛన్లు రద్దయ్యాయని.. పునరుద్ధరించాలని కోరారు. వీరి సమస్యలను పరిష్కరించాలని మంత్రి విశ్వరూప్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి