Big Fish: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది చేపల రేవులో 14 కిలోల బరువున్న కచ్చిడీ చేప రూ.69 వేల ధర పలికింది. కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన మత్స్యకారులు అంతర్వేది తీరంలో చేపల వేట సాగిస్తుండగా.. వారి వలకు కచ్చిడీ చేప చిక్కింది. దీన్ని స్థానిక మార్కెట్లో విక్రయించగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారి రూ.69 వేలకు కొనుగోలు చేశారు. దీని బ్లాడర్‌ను ఔషధాల తయారీలో వినియోగిస్తారని.. అందుకే అంత ధర పలికిందని చెప్పారు.
మత్స్యకారుల వలకు చిక్కింది కచ్చిడీ.. ధర ఎంత పలికిందంటే..! - 69 వేలు పలికిన చేప
Kachidi Fish: రోజు మాదిరి చేపల వేటకు వెళ్లారు.. మత్స్యకారుల అదృష్టం బాగుండి 14 కిలోల కచ్చిడీ చేప చిక్కింది. వారి సంతోషానికి హద్దే లేదు. దానిని మార్కెట్ తీసుకెళ్తే రూ.69 వేలు పలికింది.
fish