ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమ జిల్లాలో ప్రియుడి మర్మంగాన్ని బ్లేడుతో కోసిన ప్రియురాలు - కోనసీమ జిల్లాలో దారుణం

Private Part Cut: కోనసీమ జిల్లా రాజోలు మండలంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పెట్టుకున్న వివాహేతర సంబంధం వల్ల తనకే ముప్పు వచ్చింది. మలికిపురం మండలం గూడపల్లికి చెందిన ఒక వ్యక్తిని ప్రియురాలు ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది. అనంతరం ప్రియుడితో వాగ్వాదం పెట్టుకుని అతని మర్మంగాన్ని బ్లేడుతో కోసింది.

Private Part Cut with blade
బ్లేడు

By

Published : Dec 20, 2022, 10:06 AM IST

Private Part Cut: ప్రియుడి మర్మాంగాన్ని ప్రియురాలు బ్లేడుతో కోసిన ఘటన ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మలికిపురం మండలం గూడపల్లికి చెందిన ఒక వ్యక్తికి రాజోలు మండలం తాటిపాకకు చెందిన మరదలు వరసయ్యే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న తన ఇంట్లో ఎవరూలేరంటూ ఆమె అతడిని ఇంటికి పిలిపించుకుంది.

‘‘నువ్వు వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నావు.. నువ్వు నాకే దక్కాలి’’ అంటూ వాగ్వాదానికి దిగింది. కోపంతో బ్లేడుతో అతని మర్మాంగాన్ని కోసింది. తీవ్రగాయం కావడంతో బాధితుడ్ని రాజోలు ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి మెరుగైన వైద్యం నిమిత్తం అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ గణేశ్వరరావు సోమవారం తెలిపారు. కాగా బాధితుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details