ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్వేదికి పోటెత్తిన భక్తులు.. భీష్మ ఏకాదశికి సముద్ర స్నానాలు - antarvedi lakshminarsimha swami

Bhishma Ekadashi : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం బీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

అంతర్వేదికి పోటెత్తిన భక్తులు
అంతర్వేదికి పోటెత్తిన భక్తులు

By

Published : Feb 1, 2023, 12:38 PM IST

అంతర్వేదికి పోటెత్తిన భక్తులు

Bhishma Ekadashi : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి కళ్యాణోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. మరో వైపు బీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సముద్ర స్నానాలకు పెద్ద ఎత్తున పోటెత్తారు.

సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. బుధవారం బీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము 3గంటల నుంచి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామివారి కల్యాణం అనంతరం తెల్లవారుజాము 2గంటల నుంచే సాగర సంగమం వద్ద సముద్ర స్నానాలను ప్రారంభించారు.

సముద్రతీరం వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీస్, మెరైన్, మత్స్య శాఖ ఆధ్వర్యంలో సముద్ర తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గజ ఈతగాళ్లతో సహా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆలయ అనువంశిక ధర్మకర్త రాజబహుద్దూర్, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details