ప్రత్తిపాడులో టెన్షన్.. వరుపుల రాజా ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు - ప్రత్తిపాడులో టెన్షన్
17:59 July 22
హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులు
TENSION AT PRATHIPADU:కాకినాడ జిల్లా ప్రత్తిపాడు తెలుగుదేశం నియోజకవర్గ ఇంఛార్జ్ వరుపుల రాజా అరెస్ట్‌కు సీఐడీ ప్రయత్నిస్తోంది. పెద్ద సంఖ్యలో.. పోలీసులు రాజా ఇంటిని చుట్టుముట్టారు. తెలుగుదేశం శ్రేణులు పోలీసులను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. రాజాను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ.. జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వర్మ ఇతర నేతలు.. పోలీసుల్ని నిలదీశారు. రాజాపై ఇప్పటికే నమోదు చేసిన లంపకలోవ సొసైటీ నిధుల కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. తాజాగా ఏ కేసులో రాజాను అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐతే గండేపల్లి సొసైటీ వ్యవహారంలో మరో కేసు నమోదైందని సీఐడీ అధికారులు తెలిపారు.
నా మీద సీఐడీ, ప్రభుత్వం, పోలీసులు కక్షగట్టారు.. అరెస్టు చేయాలని గత రెండు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు.. గతంలో లంపకలోవ, ధర్మవరం సొసైటీల్లో అవినీతి జరిగిందని కేసు నమోదైంది.. అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.. మళ్లీ గండేపల్లి సొసైటీలో మీ పేరు ఉందంటూ నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారు.. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనింగ్‌పై పోరాటం చేస్తున్నందుకే నాపై కక్షగట్టారు. -వరుపుల రాజా, తెదేపా నేత
ఇవీ చదవండి: