ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Illegal mining: తురకొలకొండపై కన్నేశారు తవ్వేశారు.. బరితెగించిన మైనింగ్ మాయగాళ్లు - AP Latest News

Illegal mining in Turakolakonda: కాకినాడ జిల్లా తురకొలకొండపై 4 దశాబ్దాలుగా 250 పేద కుటుంబాలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నాయి. చెంతనే చారిత్రక బౌద్ధారామం కూడా ఉంది. అలాంటి కొండపై మైనింగ్ మాయగాళ్లు కన్నేశారు. నాయకుల అండతో అనుమతులు పొందేశారు. తవ్వడానికి వీల్లేందంటూ ప్రజలు కోర్టును ఆశ్రయించారు. తీర్పు రాకముందే కొండను కొల్లగొట్టేందుకు సిద్ధం కావడం వారి బరితెగింపునకు పరాకాష్టగా నిలుస్తోంది.

Illegal mining
తురకొలకొండపై కన్నేశారు తవ్వేశారు.. బరితెగించిన మైనింగ్ మాయగాళ్లు

By

Published : Jul 10, 2023, 8:56 AM IST

Updated : Jul 10, 2023, 11:02 AM IST

తురకొలకొండపై కన్నేశారు తవ్వేశారు

Illegal mining in Turakolakonda: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలి పరిధిలోని చారిత్రక బౌద్ధారామం ఉంది. బౌద్ధారామం కొండకు ఎదురుగా పోలవరం కాల్వ పక్కనే సర్వే నెంబర్ 133/1లో తురకొలకొండ ఉంది. దీనిని స్థానికంగా ధనంకొండ అని కూడా పిలుస్తారు. 370 ఎకరాల ఈ కొండపై పోడు వ్యవసాయం చేసుకుంటూ 250 మంది పేద రైతులు బతుకున్నారు. జీడి మొక్కలు పెంచుకొని వాటి ఫలసాయంతో జీవనోపాధి పొందుతున్నారు.

స్థానికుల వ్యతిరేకత ఉన్నా గ్రావెల్​కు అనుమతులు..గతంలో స్థానికులకు ప్రభుత్వం మొక్కలు అందించి ఉపాధి నిధులతో ఊతమిచ్చింది. అయితే.. ఈ కొండపై గ్రావెల్ తవ్వకానికి గుంటూరు ప్రాంతానికి చెందిన కొందరు దరఖాస్తు చేసుకున్నారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. పంచాయతీ తీర్మానం నుంచి పర్యావరణ అనుమతుల వరకు అన్నీ వచ్చేశాయి. 7 ఎకరాల్లో ఏడాదికి లక్ష క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వుకునేందుకు అనుమతులుపొందారు. ఈ చర్యను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

2021 నుంచే ప్రయత్నాలు.. పచ్చని తురకొలకొండపై గ్రావెల్ తవ్వకాలకు 2021 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా సాగుదారులు, బౌద్ధ సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. దశాబ్దాలుగా కొండపై ఆధారపడి భూహక్కు కోసం పోరాడుతుంటే.. గ్రావెల్ తవ్వకాలకు ఎలా అనుమతి ఇస్తారని సాగుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ తీర్మానంపై మండిపడుతున్నారు.

పేదలు సాగుచేసుకుంటున్న భూములు పరాధీనం..కొడవలిలో పేదలు సాగుచేసుకుంటున్న భూములు పరాధీనం అవుతుండటంతో స్థానికులు ధర్నాలు, నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించారు. వంటా వార్పులతో మహాధర్నాలు చేశారు. తాజాగా తెలుగుదేశం, జనసేన, దళిత సంఘాలు స్థానికులకు మద్దతుగా నిలిచాయి. గ్రామంలో టీడీపీ రిలేదీక్షలు కొనసాగిస్తోంది. చారిత్రక బౌద్ధారామంవద్ద మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వొద్దంటూ బౌద్ధ పరిరక్షణ సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, సామాజిక సంస్థలు గతంలో భారీ సభ నిర్వహించి తీర్మానాలు చేశాయి.

ఉపాధిని దూరం చేసేలా మైనింగ్‌ పనులు.. చారిత్రక బౌద్ధారామం వద్ద మైనింగ్‌కు అనుమతులు ఇవ్వరాదని అన్ని పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా బౌద్ధారామానికి పక్కనే ఉన్న కొండకు తవ్వకాలకు అనుమతివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ తీర్మానం.. పర్యావరణ అనుమతుల ఆధారంగా ఐదేళ్ల లీజుకు గుంటూరు చెందిన వ్యక్తులకు అనుమతులు ఇచ్చామని.. ఏడాదికి లక్ష క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకువే వెసులుబాటు ఉందని కాకినాడ జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి నరసింహారెడ్డి చెప్పారు. కొండ మీద జీడి, జామ వంటి తోటలు సాగుచేసుకుంటూ బతుకీడుస్తున్నామని.. ఉపాధిని దూరం చేసేలా మైనింగ్‌కు సిద్ధం కావడం సరికాదని స్థానికులు అంటున్నారు.

Last Updated : Jul 10, 2023, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details