ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుని పరిసరాల్లో పెద్దపులి.. ప్రజల్లో కలవరం - ap news

Tiger: ఇన్నాళ్లూ అటవీ ప్రాంతంలో సంచరించి.. రెండు రోజులుగా ఆనవాళ్లు లేకుండాపోయిన పెద్దపులి పాదముద్రలు మరోసారి ప్రజలు, అధికారులను ఉలికిపాటుకు గురి చేసింది. తుని మండలంలో కొండల మాటున పాదముద్రలు కనిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో కలవరం మొదలైంది. పెద్దపులి రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా.. ఆటుగా వెళ్తున్న ప్రైవేటు బస్సులోని ప్రయాణికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలోని పెద్దపులి జాడను గుర్తించే పనిలో పడ్డారు.

tiger
tiger

By

Published : Jun 28, 2022, 8:17 AM IST

Updated : Jun 28, 2022, 4:20 PM IST

Tiger at Kummarilova of Tuni Mandal: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 36 రోజులుగా సంచరిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులి.. తాజాగా తుని నియోజకవర్గంలోకి ప్రవేశించింది. రౌతులపూడి మండలం నుంచి తుని మండలం కుమ్మరిలోవ వద్దకు చేరింది. కుమ్మరిలోవ కాలనీ వద్ద పులి రోడ్డు దాటుతుండగా స్థానికులు గమనించారు. పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ అధికారులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. కుమ్మరిలోవ-కొలిమేరు మధ్య పులి పాదముద్రలను సేకరించారు. పరిసర గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేసిన పోలీసులు.. ఆయా గ్రామాలవైపు రాకపోకల్ని నిలిపివేశారు. ముచ్చెర్లకొండపై పులి కోసం అటవీ బృందం గాలిస్తోంది.

కంటికి కనిపించకుండా, సీసీ కెమెరాలకు చిక్కకుండా పాదముద్రలతోనే అలజడి రేపుతూ, అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న పులి సంచార తీరు ఆందోళనకరంగా ఉంది. మూడు రోజులు ఎస్‌.పైడిపాలలో సంచరించాక ఎ.మల్లవరం, లచ్చిరెడ్డిపాలెం గ్రామాల వెంబడి తిరిగింది. పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నామని ఏలేశ్వరం రేంజర్‌ జె.శ్రీనివాస్‌ తెలిపారు.

Last Updated : Jun 28, 2022, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details