ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పీజీ కేంద్రం భూమిలో.. వైకాపా కార్యాలయం ఏర్పాటును అడ్డుకోండి'

ఎం.ఎస్ నాయకర్ పీజీ కేంద్రానికి చెందిన భూమిని వైకాపా కార్యాలయం కోసం కేటాయించే యత్నాలను అపాలని హైకోర్టు పిల్ దాఖలైంది. తిమ్మాపురం గ్రామానికి చెందిన గణేష్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం.. సోమవారం విచారణ జరిపై అవకాశం ఉంది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Apr 16, 2022, 4:03 AM IST

వైకాపా కార్యాలయం కోసం ఎం.ఎస్ నాయకర్ పీజీ కేంద్రానికి చెందిన భూమిని కేటాయించే యత్నాలను అడ్డుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. కాకినాడ గ్రామీణం మండలంలోని తిమ్మాపురం గ్రామ పరిధిలోనిఎం.ఎస్ నాయకర్ పీజీ కేంద్రానికి చెందిన సర్వేనంబరు 110,113 లో 4.41 ఎకరాల భూమిని వైకాపా పార్టీ కార్యాలయం ఏర్పాటు జరుగుతున్న యత్నాలను నిలువరించాలని ఆ పిల్​లో కోరారు.

ఈ వ్యవహారంపై పూర్వ తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తుతం కాకినాడ జిల్లా) కలెక్టర్ ఈ ఏడాది మార్చి 22 న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ.. తిమ్మాపురం గ్రామానికి చెందిన గణేష్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపై అవకాశం ఉంది.

ఇదీ చదవండి:HIGH COURT: కోర్టు ధిక్కరణ కింద... ఆ తహసీల్దార్​కు ఆరు నెలల జైలు శిక్ష

ABOUT THE AUTHOR

...view details