ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీవీఐటీలో ఘనంగా ముగిసిన యువజనోత్సవాలు - వీవీఐటీలో ఘనంగా ముగిసిన యువజనోత్సవాలు

గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీలో యువజనోత్సవాలు ఘనంగా ముగిశాయి. రెండ్రోజుల పాటు సాగిన ఈ వేడుకల్లో... విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. యువజనోత్సవాల సందర్భంగా... విద్యార్థుల నూతన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి.

youth festival over in vvit college
వీవీఐటీలో ఘనంగా ముగిసిన యువజనోత్సవాలు

By

Published : Dec 23, 2019, 5:46 AM IST

వీవీఐటీలో ఘనంగా ముగిసిన యువజనోత్సవాలు

విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు... ఉత్సాహాన్ని పెంపొందించేందుకు వీవీఐటీ కళాశాలలో రెండ్రోజుల పాటు సాగిన యువజనోత్సవాలు ముగిశాయి. ఈ ముగింపు వేడులకు ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్లభరణి హాజరయ్యారు. వివిధ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు... నూతన ఆవిష్కరణలతో ప్రతిభ చాటారు.

సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నృత్యం, సాంకేతిక ప్రదర్శనలతో విద్యార్థులు మెప్పించారు. ఆట, పాటలతో అలరించారు. ముగింపు వేడుకల్లో మాట్లాడిన తనికెళ్ల భరణి తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించారు. ఆంగ్లం నేర్చుకోవడం ముఖ్యమేనన్న ఆయన... ఆ పేరిట అమ్మభాష తెలుగును నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అంతకుముందు కళాశాల ఛైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌తో కలసి విజేతలకు తనికెళ్ల భరణి బహమతులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details