ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకుల దాడి

గుంటూరు జిల్లా లింగాపురంలో తెదేపా వర్గీయులపై .. వైకాపా శ్రేణులు దాడులకు దిగాయి. ఈ దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్రంగా ఖండించారు.

తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతల దాడులు
తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతల దాడులు

By

Published : Feb 19, 2021, 11:03 AM IST

గుంటూరు జిల్లా అమరావతి మండలం లింగాపురంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడి చేశారు. ఎస్సీ కాలనీలో ఉన్న తెదేపా కార్యకర్తల ఇళ్లకు రాత్రి సమయంలో వైకాపా నేతలు వచ్చారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా... కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడి సిబ్బంది ఫిర్యాదు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి తమకు రక్షణ కావాలని కోరుతున్నారు.

తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతల దాడులు

ఖండించిన లోకేశ్...

దళితులపై జగన్ రెడ్డి దమనకాండ కొనసాగుతూనే ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. లింగాపురం గ్రామంలో దళితులపై వైకాపా నాయకుల దాడి జగన్ రెడ్డి అహంకార పాలనకి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. జాతి తక్కువ వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తారా...,నరికి చంపేస్తాం అంటూ బెదిరించి రాళ్లతో దళితుల పై దాడి చేయడం,ఇళ్లకు వెళ్లి బెదిరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: వర్ల

అమరావతి మండలం లింగాపురం గ్రామంలో జరిగిన దాడిని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఖండించారు. మహిళలని కూడా చూడకుండా దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు గాచినా, చర్యలు తీసుకోని పోలీసులను వెంటనే బదిలీ చేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఘటనపై విచారణకు అదేశించి గ్రామంలో ప్రశాంతత నెలకొల్పటంతో పాటు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాలన్నారు.

ఇదీ చదవండి:నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరో అవకాశం:ఎస్ఈసీ

ABOUT THE AUTHOR

...view details