ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతిపక్షం గూటికి వైకాపా నేతలు... తెదేపాలో తొలి చేరిక

రాష్ట్రంలో అధికార పార్టీ వైకాపాకు షాక్ తగిలింది. ఆ పార్టీ రెబల్​ నేత దొన్ను దొర చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఎన్నికలు ముగిశాక తెదేపాలోకి ఇదే తొలి వలస. అరకులో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొస్తామని దొన్నుదొర అన్నారు.

By

Published : Sep 4, 2019, 4:43 PM IST

దొన్ను దొర

తెదేపాలోకి కొత్తనీరు

గడచిన ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన దొన్ను దొర తెదేపాలో చేరారు. ఆయనతో పాటు మాజీ సర్పంచ్​లు, ఎంపీటీసీలు గుంటూరులో చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపాపై చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు ఇసుక డాన్​ల వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఇసుకను పక్క రాష్ట్రాలకు మళ్లిస్తూ..ప్రజల నోట్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లను కావాలనే మూసివేశారని ధ్వజమెత్తారు. జగన్​ తనతోపాటు రాష్ట్ర ప్రజల్నీ మోసం చేశారని దొన్నుదొర విమర్శించారు. అరకులో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతా సమష్టిగా పార్టీ కోసం పని చేస్తామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన దొన్నుదొర ఓట్లు దక్కించుకోవడంలో రెండో స్థానంలో ఉన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details