అమరావతిలో వైకాపా కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మూడు అంతస్తుల్లో వైకాపా కార్యాలయాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో పార్టీ కార్యక్రమాలు, రెండో అంతస్తులో పార్టీ అనుబంధ విభాగాలు, మూడో అంతస్తులో పార్టీ అధ్యక్షుడు జగన్ ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. మూడో అంతస్తులోనే పార్టీ కేంద్ర కమిటీ సభ్యులకూ ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి కేంద్ర కార్యాలయం వేదికగా వైకాపా కార్యక్రమాలు జరుగుతాయి.
అమరావతిలో వైకాపా కేంద్ర కార్యాలయం ప్రారంభం - jagan
రాజధాని అమరావతిలో వైకాపా కేంద్రం కార్యాలయం ప్రారంభమైంది. తాడేపల్లిలో నిర్మించిన వైకాపా కేంద్ర కార్యాలయాన్ని... పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ప్రారంభించారు.
ycp-launch-party-ofc-in-amaravathi