గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం రాత్రి హత్యకు గురైన తెదేపా నేత ఉమాయాదవ్ మృతదేహానికి మాజీ మంత్రులు లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావులు నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు అండగా ఉంటామని లోకేశ్ భరోసానిచ్చారు. ఉమా యాదవ్ పిల్లలను తెదేపా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ హత్యా రాజకీయాలు చేయలేదన్నారు. 2004లో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన సమయంలోనూ తమ పార్టీ కార్యకర్తలను హత్య చేశారని గుర్తు చేశారు. తెదేపా కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. బిహార్ తరహా పాలనను ఇక్కడికి తీసుకురావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వైకాపావి హత్యా రాజకీయాలు: లోకేశ్ - mangalagiri murder
వైకాపా ప్రభుత్వానివి హత్యా రాజకీయాలని మాజీ మంత్రి లోకేశ్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన తెదేపా నేత ఉమాయాదవ్ మృతదేహానికి ఆయన నివాళులర్పించారు.
మాజీ మంత్రి లోకేశ్