ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' తెదేపాకు ఓటేసినందుకే తమపై వైకాపా దాడులు' - attacks

తెదేపా కార్యకర్తలు , సానుభూతిపరులు పై దాడులు పెరిగిపోతున్నాయని తమకు రక్షణ కల్పించాలంటూ..గుంటూరు జిల్లా చెన్నాయపాలెంకు చెందిన గ్రామస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

తెదేపాకు ఓటేసినందుకే తమపై వైకాపా దాడులు'

By

Published : Jul 2, 2019, 6:06 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని కక్షసాధింపులో భాగంగా తమ పై దాడులు చేస్తున్నారని గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు . తమకు రక్షణ కల్పించాలని జిల్లా రూరల్ ఎస్పీకి వినతి పత్రం అందిచారు. వైసీపీ కార్యకర్తలు తమ పై దాడులు చేయగా మగవారు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నిన్న అర్థరాత్రి కొంతమంది ఇంటికి వచ్చి మీ భర్త ఎక్కడ అని దాడులకు పాల్పడినట్లు వాపోయింది. ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు.

గ్రామస్థుల ఆవేదన

ABOUT THE AUTHOR

...view details