ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'న్యాయదేవతా.. అమరావతిని కాపాడు తల్లీ' - న్యాయదేవత వేషం

మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని మహిళలు వినూత్న రీతిలో నిరసననలు తెలిపారు. ఓ చిన్నారిని న్యాయదేవతలా వేషధారణ చేయించారు. తమను ఆదుకోవాలంటూ మహిళలు మోకాళ్లపై నిలబడి వేడుకున్నారు.

న్యాయదేవతను వేడుకున్న రాజాధాని మహిళలు
న్యాయదేవతను వేడుకున్న రాజాధాని మహిళలు

By

Published : Mar 8, 2020, 10:01 PM IST

న్యాయదేవతను వేడుకున్న రాజాధాని మహిళలు

మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని ప్రాంతంలోని మహిళలు.. వినూత్న నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఓ చిన్నారిని న్యాయదేవతలా తీర్చిదిద్దారు. తమను ఆదుకోవాలంటూ మహిళలు మోకాళ్లపై నిలబడి న్యాయదేవతను వేడుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8 మంది మహిళలు 24 గంటలు నిరాహార దీక్ష చేపట్టారు. ఎర్రబాలెం, నిడమర్రు, నవులూరులోనూ రైతులు 82వ రోజు దీక్షలు కొనసాగించారు. తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లిలోని రైతులు దీక్షలో పాల్గొన్నారు. పెనుమాకలో యువకులు చేస్తున్న 80 గంటల నిరవధిక దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details