గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన దేవరకొండ మేరీ(50) పేరిచర్ల కూడలిలోని డివైడర్ దాటుతుండగా.. గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వెళుతున్న ఓ లారీ మహిళను ఢీ కొట్టింది. ఈ ఘటనలో సదరు మహిళలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న మేడికొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణాలను సేకరించి కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మారుతి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
DEAD: రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని.. మహిళ మృతి - crime news
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
DEAD