గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్లలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మహిళలు ఆందోళన చేశారు. గ్రామదేవత అద్దంకమ్మకు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. అమరావతి పరిరక్షణకు అద్దంకమ్మ తల్లి ఆశీస్సులు కోరుతూ ఆడపడుచులు చేపట్టిన పొంగళ్ల కార్యక్రమంలో స్థానిక తెదేపా నేతలు వేగేశ్న నరేంద్రవర్మ, తాత జయప్రకాష్, మానం విజేత పాల్గొన్నారు. బాపట్ల - గుంటూరు రహదారిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి అమ్మవారి గుడి వరకు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లిన మహిళలు.. గ్రామదేవతకు పొంగళ్లు సమర్పించారు.
అమరావతి పరిరక్షణకు అద్దంకమ్మకు పొంగళ్లు - ఏపీ రాజధాని ప్రాబమ్ న్యూస్
గుంటూరు జిల్లా అప్పికట్లలో అమరావతి పరిరక్షణ కోసం మహిళలు ఆందోళన చేశారు. రాజధాని తరలిపోకుండా చూడాలంటూ గ్రామదేవత అద్దంకమ్మకు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక తెదేపా నేతల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
అమరావతి పరిరక్షణకు అద్దంకమ్మకు పొంగళ్లు పెట్టిన మహిళలు