ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేబ్రోలులో తెరుచుకున్న మద్యం దుకాణాలు

ఇన్నిరోజులు కంటైన్మెంట్ జోన్​గా ఉన్న గుంటూరు జిల్లా చేబ్రోలులో నేడు మందు దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం ప్రియులు దుకాణాల ముందు వరుసలు కట్టారు.

By

Published : May 23, 2020, 7:50 PM IST

wine shops open in chebrolu guntur district
చేబ్రోలులో తెరుచుకున్న మద్యం దుకాణాలు

గుంటూరు జిల్లా చేబ్రోలులో నేడు మందు దుకాణాలు తెరుచుకున్నాయి. ఇన్ని రోజులు కంటైన్మెంట్ జోన్​గా ఉన్నందున వైన్ షాపులు తెరవలేదు. నేడు తెరుచుకున్న దుకాణాల ముందు మందుబాబులు క్యూలు కట్టారు. మాస్కులు ధరించి, గొడుగులు వేసుకుని, భౌతిక దూరం పాటిస్తూ వేచిచూశారు.

అయితే చేబ్రోలు నుంచి గుంటూరు చాలా దగ్గర అయినందున అక్కడినుంచి మద్యం ప్రియులు వస్తారేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరులో కరోనా కేసులు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. ప్రధాన రహదారిపై ఉన్న మద్యం దుకాణాన్ని మూసేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి... జిల్లాలో కొత్తగా 4 కేసులు.. కొత్త ప్రాంతాల్లో ఇద్దరికి కరోనా

ABOUT THE AUTHOR

...view details