ఆంధ్రప్రదేశ్‌ను మద్యరహితంగా మార్చడమే జన చైతన్య వేదిక ప్రధాన లక్ష్యమని వేదిక కన్వీనర్ లక్ష్మారెడ్డి వ్యాఖ్యనించారు. గుంటూరు జిల్లా అరుండల్ పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన... మద్యనిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఈ నెల 12న ఈ అంశంపై గుంటూరు జిల్లా పలకలూరులోని విజ్ఞాన్ మహిళా కళాశాలలో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మద్యపాన నిషేధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
'రాష్ట్రాన్ని మద్యరహితంగా మార్చడమే మా లక్ష్యం' - jana chaitanya vedhika
ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేదాన్ని అమలులోకి తీసుకువచ్చి రాష్ట్రాన్ని మద్యరహితంగా మార్చడమే తమ లక్ష్యమని జనచైతన్య వేదిక ప్రధాన కన్వీనర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
'మద్యరహిత రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం'