రాజధాని మార్పును ఒప్పుకునే ప్రసక్తే లేదని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే రాజధాని మార్పును అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. కోర్టులు కూడా చివాట్లు పెట్టిన ప్రభుత్వానికి జ్ఞానోదయం కావడం లేదని దుయ్యబట్టారు. అధికారపార్టీ చర్యలను తాము అడ్డుకుని తీరుతామని అన్నారు. వికేంద్రీకరణ బిల్లును మనీ బిల్లుగా తీసుకురావడం సరికాదని యనమల మండిపడ్డారు. ఇది మనీ బిల్లు కిందకు రాదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటాం: యనమల - ఏపీ అసెంబ్లీ సమావేశాలు
పాలనా వికేంద్రీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేసే అడుగులను తాము అడ్డుకుని తీరుతామని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాజధాని మార్పును అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు.
'We will try to stop government actions on amaravati' says yanamala