ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాడులపై.. చెప్పులు కుట్టి తెదేపా ఎమ్మెల్యే నిరసన - వినుకొండ

తెదేపా నేతలపై జరుగుతున్న వరుస దాడులను వ్యతిరేకిస్తూ.... వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు చెప్పులు కుట్టి నిరసన తెలిపారు. రాజకీయ స్వలాభం కోసమే నరేంద్ర మోదీ... తెదేపా అభ్యర్థులపై ఐటీ సోదాలు జరిపిస్తున్నారని ఆరోపించారు.

చెప్పులు కుట్టి నిరసన తెలిపిన తెదేపా ఎమ్మెల్యే

By

Published : Apr 5, 2019, 5:37 PM IST

చెప్పులు కుట్టి నిరసన తెలిపిన తెదేపా ఎమ్మెల్యే

తెదేపా నేతలపై జరుగుతున్న వరుస దాడులను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు చెప్పులు కుట్టి నిరసన తెలిపారు. బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి... అక్కడే బైఠాయించారు. రాజకీయ స్వలాభం కోసమే నరేంద్ర మోదీ... తెదేపా అభ్యర్థులపై ఐటీ సోదాలు జరిపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్తారన్నారు.

ABOUT THE AUTHOR

...view details