గుంటూరు జిల్లా నిజాంపట్నంలో అక్రమ విద్యుత్ చౌర్యంపై విద్యుత్ విజిలెన్సు బృందాలు విస్తృతంగా దాడులు నిర్వహించాయి. జిల్లాకు చెందిన 82 మంది అధికారులు సిబ్బంది 41 బృందాలుగా ఏర్పడి విద్యుత్ అక్రమచౌర్యంపై దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 73 మందిని అధికారులు గుర్తించారు. వారికి రూ. 3.93 లక్షలు అపరాధ రుసుం విధించారు. మీటరు లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరు, మీటర్ ఉండి అక్రమంగా విద్యుత్ పొందుతున్న 19 మంది, వేరే కేటగిరీలో విద్యుత్ వాడుతున్న 11 మంది, అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 39 మంది, వాడకం కంటే తక్కువ బిల్లులు ఇవ్వబడిన రెండు సర్వీసులను అధికారులు గుర్తించారు. విద్యుత్ చౌర్యం సామాజిక చౌర్యమని... ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరిగితే పూర్తి వివరాలతో 94408 12263, 8331021847 నంబర్లకు ఫోన్ ద్వారా లేదా వాట్సప్ ద్వారా సమాచారం ఇవ్వాలని విద్యుత్ శాఖ ఈఈలు, డీపీఈ మూర్తి, హనుమయ్య తెలిపారు.
విద్యుత్ చౌర్యంపై విజిలెన్సు బృందాలు దాడులు - power theft in guntur district news update
గుంటూరు జిల్లాలో విద్యుత్ చౌర్యంపై ఆ శాఖ విజిలెన్సు బృందాలు విస్తృతంగా దాడులు జరిపారు. వివిధ మార్గాల్లో విద్యుత్ చౌర్యం చేస్తున్న పలువురికి అపరాధ రుసుములు విధించారు. విద్యుత్ చౌర్యం అంటే సామాజిక దోపిడేనని, ఎక్కడైన విద్యుత్ చౌర్యం జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు.
విద్యుత్ చోరీపై విజిలెన్సు బృందాలు దాడులు