శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గూడూరు-విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ను ప్రారంభించారు.ఈ ప్రాజెక్టు ప్రారంభంతో తన చిన్ననాటి కల నెరవేరినట్లైందని ఆయన అన్నారు.సొరంగ మార్గం ద్వారా నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు.భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ముందు ఉన్నదని అన్ని దేశాలు మన వైపు చూస్తున్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వేమంత్రి సురేష్ అంగడి,కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్,రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,నెల్లూరు ఎంపీ.ఆదాల ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్,ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి,గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్,రైల్వే అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
గూడూరు-విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం - Vice President
గూడూరు-విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ రైలు మార్గంతో తన చిన్ననాటి కోరిక నెరవేరినట్లైందని ఆయన అన్నారు.
Vice President started of Inter City Express in Gudur.