ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రముఖ పారిశ్రామికవేత్త వాసిరెడ్డి కృష్ణమూర్తి కన్నుమూత - 1960లో చలువ యంత్రాలు విజయవాడకు తెచ్చారు

ప్రముఖ పారిశ్రామికవేత్త వాసిరెడ్డి కృష్ణమూర్తి అనారోగ్యంతో కన్నమూశారు. మంగళగిరి ఎల్ఈపీఎల్ భవనసముదాయంలో కృష్ణమూర్తి పార్ధివ దేహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఘన నివాళి అర్పించారు. కాగా ఈయన 1960వ దశకంలో విజయవాడకు చలువ యంత్రాలను తీసుకొచ్చారు.

కృష్ణమూర్తి కన్నుమూత
కృష్ణమూర్తి కన్నుమూత

By

Published : Jan 15, 2023, 4:27 PM IST

విజయవాడలోని ప్రముఖ పారిశ్రామికవేత్త వాసిరెడ్డి కృష్ణమూర్తి అనారోగ్యంతో కన్నమూశారు. మంగళగిరి ఎల్ఈపీఎల్ భవనసముదాయంలో కృష్ణమూర్తి పార్ధివ దేహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఘన నివాళి అర్పించారు. 1932 లో జన్మించిన కృష్ణమూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1960వ దశకంలో విజయవాడకు చలువ యంత్రాలను తీసుకొచ్చారు. యానాంలో చలువ యంత్రాల పరిశ్రమను స్థాపించారని కృష్ణమూర్తి కుమారుడు నాగార్జున చెప్పారు. కమ్యునిజం భావాలను అందిపుచ్చుకున్న కృష్ణమూర్తి.... నాస్తికుడిగానే జీవించారన్నారు. ఆయన చివరి కోరిక మేరకు కృష్ణమూర్తి పార్ధీవ దేహాన్ని విజయవాడ లోని సిద్ధార్థ ఆస్పత్రికి అందజేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details