ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఇరువురికి గాయాలు - Street fight between two groups two injured

గుంటూరు జిల్లా మాడుగుల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల పరస్పర ఘర్షణతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఇరువురికి గాయాలు

By

Published : Oct 5, 2019, 9:56 PM IST

ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఇరువురికి గాయాలు
గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన గొడవతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. ఎటుంటి ఘర్షణ చోటు చేసుకోకుండా డీఎస్పీ శ్రీ హరిబాబు పోలీసు సిబ్బందితో మాడుగుల గ్రామంలో కవాతు నిర్వహించారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు గొడవపడిన వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గ్రామస్తులు సంయమనం పాటించాలని డీఎస్పీ కోరారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details