గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీనటంతో ప్రమాదం జరిగింది. ఘటనలో మృతి చెందిన ఇద్దరు యువకులు ప్రత్తిపాడు మండలం నిమ్మగడ్డ వారిపాలెంకు చెందిన వాసు, ఏటుకూరుకు చెందిన ప్రతాప్లుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తి మృతి చెందిన వాసు తండ్రి అని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. హెల్మెట్ పెట్టుకొని ఉంటే... ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడేవారని స్థానికులు తెలిపారు.
'హెల్మెట్ ధరించి ఉంటే... ఇద్దరూ బతికేవారు' - two died in kurnuthala road accident news
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా... ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కుర్నూతల వద్ద జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి