బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మొదటిసారిగా ట్విట్టర్ ఖాతాను తెరిచారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు సామాజిక మాధ్యమాలే ప్రస్తుత వేదికలని బీఎస్పీ పార్టీ తెలిపింది. అయితే పక్షం రోజులుగా ఆమె పేరుతో ఖాతాను నడుపుతున్నారు.
ట్విట్టర్ ఖాతా తెరిచిన మాయావతి - ట్విట్టర్
ప్రజలతో త్వరగా మమేకం అయ్యేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్విట్టర్ ఖాతాను వేదికగా చేసుకోనున్నారు.
ట్విట్టర్ ఖాతా తెరిచిన మాయావతి
రాజకీయ, జాతీయ అంశాలపై తన భావాలను మాయావతి సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటారని బీఎస్పీ ప్రకటించింది.
"ట్విట్టర్లో చేరాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయించారు. ప్రజలతో త్వరగా మమేకం కావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. జాతీయ, రాజకీయాంశాలపై చర్చిస్తార"ని మాయావతి ఖాతా ద్వారా పార్టీ ప్రకటించింది.