నిబంధనల ఉల్లం'ఘనులు'కు... ట్రాఫిక్ పోలీస్ విధులు - punishment
రోడ్డు నియమాలను ఉల్లఘింస్తే ఏం చేస్తారు? జరిమానా కట్టించుకుంటారు. తీవ్రమైన నేరమైతే జైలు శిక్ష విధిస్తారు అని అనుకుంటారు అందరూ. కానీ గుంటూరు పోలీసులు మాత్రం వినూత్న పంథా ప్రయోగిస్తున్నారు. తప్పు చేసిన వారితోనే తప్పు చేయవద్దంటూ ఇతరులకు సూచించేలా చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన పెంచేందుకు గుంటూరు జిల్లా అధికారులు సరికొత్త పంథా ఎంచుకున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా, మద్యం తాగి బండెక్కినా, హెల్మెట్ లేకున్నా భారీ జరిమానాలతో పాటు ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ వేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించండి అని రాసి ఉన్న ఫ్లకార్డులను వారి చేతికిచ్చి... ప్రధాన కూడళ్లలో నిలబెట్టారు. వాహనదారుల్లో స్వీయ నియంత్రణ కోసమే ఈచర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నా.... వాహనదారులు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వేల రూపాయల జరిమానా విధించి.. మరలా ఈ శిక్షేంటని అంటున్నారు.