గుంటూరులో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్
రోడ్లపై ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు, రణగొణ ధ్వనులు సృష్టించే ర్యాష్ డ్రైవర్లపై గుంటూరు ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపించారు. నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన పలువురు ద్విచక్ర వాహన చోదకులను అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకడ్రైవ్ నిర్వహించారు. రోడ్లపై స్నేక్ డ్రైవింగ్, ఫైర్ కటింగ్ డ్రైవ్ చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సైలెన్సర్ లేకుండా విపరీతమైన శబ్దాలు కల్గించే వాహన చోదకులపై కేసులు నమోదు చేసి, వీరి వద్ద నుంచి 12 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ సుప్రజ వీరికి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహనాలకు విపరీతమైన శబ్దాలు చేసే పరికరాలను అమరుస్తున్న మెకానిక్లపైనా క్రిమినల్ కేసులు పెడతామని డీఎస్పీ హెచ్చరించారు. పిల్లలకు ద్విచక్రవాహనాలు ఇచ్చేముందు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సుప్రజ కోరారు..
TAGGED:
PRABHUSARMA