తొలి ఏకాదశి పర్వదినం... ఆలయాల్లో భక్తజనం - tholi yekadsi
తొలిఏకాదశి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. అమ్మవార్లకు శాకాంబరి అలంకరణతో ఘనంగా పూజలు జరిపారు. కదంబం ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు.
హిందువుల తొలిపండుగగా భావించే తొలిఏకాదశి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. శాకాంబరి ఉత్సవాలు, ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ ఆలయంలో విగ్రహాలను కూరగాయలతో అలంకరించి పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలంగిలోని కనకదుర్గమ్మను సుమారు టన్ను కూరగాయలతో అలంకరించారు. ఆషాడ శుద్ధ ఏకాదశి సందర్భంగా పలుచోట్ల చండీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. విశాఖ గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చోడవరంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో విశ్వరూప అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణ చూసేందుకు భక్తులు తరలివచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోస్వామివారికి పాలాభిషేకం నిర్వహించారు.